మేకప్‌ మాన్‌కు క్లాప్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:13 AM

దివంగత నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్‌ అవుటూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మేకప్‌ మ్యాన్‌’. దివాకర్‌ యడ్ల దర్శకత్వం వహిస్తున్నారు...

మేకప్‌ మాన్‌కు క్లాప్‌

దివంగత నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్‌ అవుటూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మేకప్‌ మ్యాన్‌’. దివాకర్‌ యడ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్‌ మెట్టుపల్లి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి కుమార్‌ చౌదరి క్లాప్‌ కొట్టగా, లయన్‌ సాయి వెంకట్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. భరత్‌ పారేపల్లి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రతి చిత్రానికి కీలకమైన మేకప్‌ మ్యాన్‌ల పాత్రను, వారి జీవితాన్ని ఇందులో చూపించనున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో కట్టా రంజిత్‌, ఆనంద్‌ భారతి, చిట్టిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి

డిఓపి, ఎడిటర్‌: వాసు వర్మ,

సంగీతం: ఎం ఎం శ్రీలేఖ.

Updated Date - Apr 14 , 2024 | 04:13 AM