సరిహద్దులు లేని సినిమా

ABN , Publish Date - Oct 28 , 2024 | 12:18 AM

అజిత్‌ దాల్మియా నిర్మాణంలో ప్రమోద్‌ కుమార్‌ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘ఫౌజా’. కార్తీక్‌ దమ్ము, ఐశ్వర్యా సింగ్‌, పవన్‌ మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా...

అజిత్‌ దాల్మియా నిర్మాణంలో ప్రమోద్‌ కుమార్‌ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘ఫౌజా’. కార్తీక్‌ దమ్ము, ఐశ్వర్యా సింగ్‌, పవన్‌ మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్ర కథానాయకుడు కార్తీక్‌ దమ్ము, హీరో విజయ్‌ ధరన్‌ దాట్ల తదితరులు పాల్గొన్నారు. హీరో కార్తీక్‌ దమ్ము మాట్లాడుతూ ‘సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు. మరీ ముఖ్యంగా ఇలాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లోకి ఈ చిత్రం రానుంది’ అని తెలిపారు. దర్శకుడు ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ‘ఫౌజా’ నచ్చుతుంది’ అని అన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 12:18 AM