చిత్రామృతం నాకు దక్కిన గౌరవం
ABN , Publish Date - Oct 18 , 2024 | 12:41 AM
ప్రముఖ సినీ నేపథ్య గాయని కేఎస్ చిత్ర 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ‘చిత్రామృతం’ పేరుతో సినీ సంగీత విభావరి జరగనుంది. డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం...
ప్రముఖ సినీ నేపథ్య గాయని కేఎస్ చిత్ర 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ‘చిత్రామృతం’ పేరుతో సినీ సంగీత విభావరి జరగనుంది. డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్వాహకులు నిర్వహించిన సన్నాహక కార్యక్రమానికి కేఎస్ చిత్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘చిత్రామృతం’ అంటూ నా పేరుతో ఏకంగా ఓ సినీ సంగీత విభావరిని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్నొక గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు గీతాలతో సంగీత విభావరి ప్రేక్షకులను అలరిస్తుంది’ అని చెప్పారు. సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, గాయకుడు శ్రీకృష్ణ ‘చిత్రామృతం’ కాన్సెప్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.