చిరంజీవి నో.. వెంకటేశ్‌ ఎస్‌ ?

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:06 AM

ఇండస్ట్రీలో ఒక హీరో నో చెప్పిన చిత్రాలకు మరో హీరో ఎస్‌ చెప్పడం పరిపాటే. తాజాగా టాలీవుడ్‌లోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుందని ఇండస్ట్రీ టాక్‌. దిల్‌ రాజు నిర్మాతగా దర్శకుడు అనిల్‌ రావిపూడి...

చిరంజీవి నో.. వెంకటేశ్‌ ఎస్‌ ?

ఇండస్ట్రీలో ఒక హీరో నో చెప్పిన చిత్రాలకు మరో హీరో ఎస్‌ చెప్పడం పరిపాటే. తాజాగా టాలీవుడ్‌లోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుందని ఇండస్ట్రీ టాక్‌. దిల్‌ రాజు నిర్మాతగా దర్శకుడు అనిల్‌ రావిపూడి చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారనే మాట కొన్నాళ్లుగా పరిశ్రమలో వినిపిస్తోంది. ప్రాజెక్ట్‌ కూడా దాదాపు ఓకే అయినట్లేనని భావించారు. కానీ ఆ కథ చిరంజీవిని మెప్పించలేకపోయిందనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. దాంతో వెంకటేశ్‌ దగ్గరకు వెళ్లిన అనిల్‌ రావిపూడి అదే కథను ఓకే చేయించుకున్నారనీ, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. అయితే ఇంతకీ ఆ కథలో చిరంజీవికి ఏం నచ్చలేదు, వెంకటేశ్‌కు ఏం నచ్చి ఓకే చేశారు అనేది ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చి ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకూ మిస్టరీగానే మిగిలిపోతుంది.

Updated Date - Feb 02 , 2024 | 03:06 AM