మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mega Star: జనసేనకు మెగాస్టార్ చిరంజీవి రూ. ఐదు కోట్ల విరాళం

ABN, Publish Date - Apr 08 , 2024 | 05:22 PM

ముగ్గురు మెగా సోదరులు ఈరోజు క్రియాంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా సెట్స్ లో కలుసుకున్నారు. చిరంజీవి తమ్ముడిని సాధారంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి ఇష్ట దైవం ఆంజనేయస్వామి విగ్రహం ముందు తమ్ముడిని ఆశీర్వదించి, జన సేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి.

Mega Star Chiranjeevi donated Rs 5 crore to the Jana Sena Party

అది ఒక అపూర్వ సన్నివేశం. ముగ్గురు మెగా అన్నదమ్ములు, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు చిరంజీవి 'విశ్వంభర' సినిమా షూటింగ్ సెట్స్ లో కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఆశీర్వదించారు. 'జనసేనకు విజయోస్తు, విజయీభవ' అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు.

అదే సమయంలో అంజనీపుత్రుడు హనుమాన్ విగ్రహం దగ్గరే జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం పదిగంటలకు లొకేషన్ కు చిన్నన్న నాగబాబుతో కలసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి, చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు.

చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆలింగనం చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి, అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందచేశారు. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన రామ్ చరణ్ కూడా తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.

చిరంజీవి చెక్కును అందించిన ఈ సన్నివేశంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు, టి.శివశంకర్, కోశాధికారి ఎ.వి.రత్నం, అధికార ప్రతినిధి వి.అజేయ కుమార్, అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 05:50 PM