బాలల పోరాటం

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:32 AM

చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వంలో కేపీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘బాలతేజం’. దిలీప్‌ రాథోడ్‌, ఇరిగే రమేష్‌, హీరోయిన్‌లుగా అరవింద, షన్ను, చెన్నకేశవ నాయుడు కీలక పాత్రల్లో...

బాలల పోరాటం

చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వంలో కేపీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘బాలతేజం’. దిలీప్‌ రాథోడ్‌, ఇరిగే రమేష్‌, హీరోయిన్‌లుగా అరవింద, షన్ను, చెన్నకేశవ నాయుడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా షూటింగ్‌ కూకట్‌పల్లి-ఆల్విన్‌ కాలనీలో ప్రారంభమైంది. డ్రగ్స్‌ సరఫరా చేసి యువతను నిర్వీర్యం చేస్తున్న ముఠాపై బాలలు చేసిన పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా సినిమా ఉంటుందని డైరెక్టర్‌ చిత్తజల్లు ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jun 14 , 2024 | 03:32 AM