చెంగల్వ చేయందేనా

ABN , Publish Date - May 30 , 2024 | 12:16 AM

దర్శకుడు శంకర్‌, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌. సుభాస్కరన్‌ నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం..

చెంగల్వ చేయందేనా

దర్శకుడు శంకర్‌, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌. సుభాస్కరన్‌ నిర్మాత. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 12న విడుదలవుతోంది. ఒక్కో అప్డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. బుధవారం మేకర్స్‌ ‘చెంగల్వ చేయందేనా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత సారథ్యం వహించారు. అబ్బి, శ్రుతికా సముద్రాల ఆలపించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌. జె సూర్య, బాబీ సింహ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆడియో వేడుకను జూన్‌ 1న చెన్నైలో చిత్రబృందం గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. ఈ చిత్రం తెలుగు థియేట్రికల్‌ హక్కులను ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, శ్రీలక్ష్మీ మూవీస్‌ దక్కించుకున్నాయి.

Updated Date - May 30 , 2024 | 12:16 AM