చతుర్‌... వితుర్‌

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:04 AM

హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, చమ్మక్‌ చంద్ర .. సినిమాలో ఉన్నారంటే చాలు హాస్యానికి కొదవుండదు. తాజాగా వీరిద్దరూ ‘అరి’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమాలో వాళ్ల పేర్లు ఏమిటో తెలుసా?...

హాస్య నటులు శ్రీనివాసరెడ్డి, చమ్మక్‌ చంద్ర .. సినిమాలో ఉన్నారంటే చాలు హాస్యానికి కొదవుండదు. తాజాగా వీరిద్దరూ ‘అరి’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమాలో వాళ్ల పేర్లు ఏమిటో తెలుసా? చతుర్‌, వితుర్‌. పేర్లలోనే కామెడీ ఉంది కదూ. సినిమాలో కూడా బాగా నవ్విస్తారని దర్శకుడు జయశంకర్‌ చెప్పారు. పండితుల వేషధారణలో ఉన్న వీరి గెటప్‌ ఫస్ల్‌ లుక్‌ని సోమవారం విడుదల చేశారు. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయికుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘అరి’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. శ్రీనివాస్‌ రామిరెడ్డి, డాక్టర్‌ తిమ్మప్ప నాయుడు, శేషు మారంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:04 AM