అమరావతిలో చంద్రబాబు బయోపిక్‌ ప్రారంభం

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:58 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్‌ ‘ధర్మ చక్ర’ షూటింగ్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టి శనివారం...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్‌ ‘ధర్మ చక్ర’ షూటింగ్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టి శనివారం ప్రారంభించారు. రాజధాని గ్రామం మల్కాపురం వి స్క్వేర్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. పసుపులేటి వెంకట రమణ దర్శకత్వంలో మనోహర్‌ నాయుడు నిర్మిస్తున్నారు. పది రోజుల పాటు అమరావతిలో షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కూడా కళాకారులతో నటిస్తారు.

తుళ్లూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 14 , 2024 | 02:58 AM