సెన్సార్‌ ఆమోదం

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:21 AM

కంగనా రనౌత్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఎమర్జెన్సీ’. వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్‌ ఆమోదం లభించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యు/ఎ

కంగనా రనౌత్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఎమర్జెన్సీ’. వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్‌ ఆమోదం లభించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికేట్‌ జారీ చేసింది. అయితే కొన్ని అభ్యంతకర సీన్స్‌ సినిమాలో నుంచి తొలగించాలని లేదా వాటి స్థానంలో ఇతర సన్నివేశాలు జతచేయమని చిత్రబృందానికి సెన్సార్‌ బోర్డు సూచించింది. ఈ నెల 6న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సిక్కు సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో సినిమాకు సెన్సార్‌ ఆలస్యమయ్యింది. త్వరలోనే చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనుంది.

Updated Date - Sep 09 , 2024 | 05:21 AM