వినాయకన్‌పై కేసు

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:18 AM

రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు వినాయకన్‌. శనివారం కొచ్చి నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు

రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు వినాయకన్‌. శనివారం కొచ్చి నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వినాయకన్‌ తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారు. వారు సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన భద్రతా సిబ్బందిపైనా ఆయన దురుసుగా ప్రవర్తించాడు. దాంతో వినాయకన్‌ను అదుపులోకి తీసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఆయనపై న్యూసెన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఆర్జీఏఐ సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. అనంతరం వినాయకన్‌ను అక్కడి నుంచి పంపించగా.. గోవా వెళ్లారు.

- శంషాబాద్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 09 , 2024 | 05:18 AM