స్వేచ్ఛ, ఆత్మగౌరవాలకు అద్దం పట్టే కెప్టెన్ మిల్లర్
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:50 AM
జాతీయ ఉత్తమనటుడు ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మీడియాతో ముచ్చటించారు...

జాతీయ ఉత్తమనటుడు ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మీడియాతో ముచ్చటించారు.
‘కెప్టెన్ మిల్లర్’ ఆలోచన నాకు పదేళ్లక్రితమే మొగ్గ తొడిగింది. కథ రాస్తున్నప్పుడు తెలీకుండానే కథానాయకుడిగా ధనుష్ నా మస్తిష్కంలో మెదిలాడు. కథ పూర్తవ్వగానే ఆయన్ను కలిశాను. తనకు కూడా కథ బాగా నచ్చింది. అలా ‘కెప్టెన్ మిల్లర్ మొదలైంది. బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయ సైనికుడి కథ ఇది. ధనుష్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.
ఇది చిత్రమైన కథ. 40శాతం యాక్షన్ ఉంటుంది. మిగతా అంతా హీరో ప్రయాణమే. ఇదోక ప్యూర్ డ్రామా. ప్రేక్షకులు తమకు తాము ఐడెంటిఫై చేసుకునేలా ఇందులో పాత్రలు ఉంటాయి. పాత్రధారులంతా ఒదిగిపోయి నటించారు. ఇందులోని ఓ కీలక పాత్రలో శివరాజ్‌కుమార్ నటించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. కన్నడ బ్లాక్‌బాస్టర్ ‘ఓం’లోని శివన్ననటనను మళ్లీ ఈ సినిమా గుర్తుచేస్తుంది. ఆయన లుక్. స్ర్కీన్ ప్రెజన్స్ అద్భుతం. శివన్న పాత్ర ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో కొత్తగా కనిపిస్తుంది. పూర్తిగా అభినయానికి అవకాశం ఉన్న పాత్రను ఇందులో ఆమె చేసింది. అలాగే సందీప్‌కిషన్ కూడా మంచి పాత్ర చేశారు. జీవీప్రకాశ్ సంగీతం, ముఖ్యంగా నేపథ్యసంగీతం ఈ సినిమాకు హైలైట్. 1930లో జరిగే కథ ఇది. అందుకే కెమెర్ డిపార్ట్‌మెంట్‌తోపాటు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా చాలా శ్రమించాల్సివచ్చింది. సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుంది. ‘కెప్టెన్ మిల్లర్’ స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించి చర్చించే కథ. అందరికీ నచ్చుతుందని నా నమ్మకం.