దర్శకుణ్ణి తప్పు పట్టలేం

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:00 AM

మితిమీరిన హింసతో పాటు మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖుల విమర్శలు ఎదుర్కొంది ‘యానిమల్‌’ చిత్ర బృందం. తాజాగా విమర్శకుల జాబితాలో నటి ఖుష్బూ...

దర్శకుణ్ణి తప్పు పట్టలేం

మితిమీరిన హింసతో పాటు మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖుల విమర్శలు ఎదుర్కొంది ‘యానిమల్‌’ చిత్ర బృందం. తాజాగా విమర్శకుల జాబితాలో నటి ఖుష్బూ చేరారు. ‘‘యానిమల్‌’ సినిమాలో కుటుంబ విలువలను, మహిళలను కించపరిచిన తీరుకు బాధపడతావు, ఆ సినిమా చూడొద్దు’ అని మా పిల్లలు నన్ను హెచ్చరించారు’ అని ఖుష్బూ చెప్పారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘ఇందులో దర్శకుణ్ణి తప్పు పట్టాల్సిన పని లేదు. ‘యానిమల్‌’ లాంటి సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయంటే ముందు జనాల ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. బాగా చదువుకున్నవాళ్లు కూడా ఇలాంటి సినిమాలను ఆదరించడం బాధాకర ం. ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తున్నప్పుడు వాళ్లు కూడా అలాంటి వాళ్లేనేమో అనిపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సందీ్‌పరెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా నటించారు. రష్మిక మందన్న కథానాయిక.

Updated Date - Feb 29 , 2024 | 05:00 AM