మిస్‌ యూనివర్స్‌తో ‘క్యాలెండర్‌’ సాంగ్‌

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:27 AM

కమల్‌ హాసన్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘భారతీయుడు 2’. ఇది 1996లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న సంగతి...

మిస్‌ యూనివర్స్‌తో ‘క్యాలెండర్‌’ సాంగ్‌

కమల్‌ హాసన్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘భారతీయుడు 2’. ఇది 1996లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే. టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియన్‌ మూవీ 12న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సోమవారం ఈ సినిమా నుంచి ‘క్యాలెండర్‌’ లిరికల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో దక్షిణాఫ్రికాకు చెందిన మోడల్‌, 2017 మిస్‌ యూనివర్స్‌ డెమి లీ టెబో నటించి.. పాటకే ప్రత్యేకార్షణగా నిలిచారు. అలాగే ఇదివరకటి శంకర్‌ సినిమాల్లోని పాటల్లాగే ఇందులోనూ గ్రాండ్‌ స్కేల్‌లో విజువల్స్‌ ఉన్నాయి.


ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, శ్రావణ భార్గవి ఆలపించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎ.శ్రీకర ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుందర్‌ రాజ్‌.

Updated Date - Jul 02 , 2024 | 12:27 AM