అయితే నన్నెందుకు పిలిచారు
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:22 AM
సినీ నటి మీనా ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఐఫా 2024 వేడుకలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేడుకలో మీనా మాట్లాడుతున్న సందర్భంలో...
సినీ నటి మీనా ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఐఫా 2024 వేడుకలో పాల్గొన్నారు. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేడుకలో మీనా మాట్లాడుతున్న సందర్భంలో ఒక రిపోర్టర్ మీనాని హిందీలో మాట్లాడమని అడిగారు. దానికి ఆమె సమాధానమిస్తూ ‘‘ఇది కేవలం హిందీ వేడుకా? అయితే నన్నెందుకు ఆహ్వానించారు’’ అని రిపోర్టర్‌పై సీరియస్ అయ్యారు. అదే వేదికపై అమె మాట్లాడుతూ‘‘ దక్షిణాది సినిమాలు, ప్రజలు అద్భుతం. నేను దక్షిణాది నటిని అయినందుకు గర్వపడుతున్నా. ఐఫా ఉత్సవాలు నార్త్.. సౌత్ అంటూ తేడా లేకుండా సినీ పరిశ్రమలోని అందరినీ కలుపుతోందని.. ఈ వేడుకకు వచ్చి పరిశ్రమలోని అందర్నీ కలుసుకోవడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.