బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు బన్నీ

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:52 AM

‘పుష్ప’ చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని సత్తా చాటారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఆయన మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రతిష్ఠాత్మక బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో...

బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు బన్నీ

‘పుష్ప’ చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని సత్తా చాటారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఆయన మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రతిష్ఠాత్మక బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ సినిమా తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశం అల్లు అర్జున్‌కు దక్కింది. 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనాల్సిందిగా ఆయన కు ఆహ్వానం అందింది. దీంతో గురువారం బన్నీ జర్మనీ వెళ్లారు. ‘పుష్ప’ సినిమాను ఈ చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.

Updated Date - Feb 16 , 2024 | 05:52 AM