బుల్లెట్‌ యాక్షన్‌

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:36 AM

రవి వర్మ, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుల్లెట్‌’. చౌడప్ప దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా...

బుల్లెట్‌ యాక్షన్‌

రవి వర్మ, సంజనా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుల్లెట్‌’. చౌడప్ప దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. దర్శకులు వి. సముద్ర, ప్రొడ్యూసర్‌ ఏ ఎం రత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏ. ఎం. రత్నం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లే ఆరడుగుల బుల్లెట్‌ను హీరోగా సెలెక్ట్‌ చేశారు’’ అని అన్నారు. దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర దర్శకుడు చౌడప్ప నాకు మంచి మిత్రుడు. ఆయన ఎంతో ప్యాషన్‌తో తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఇదొక యాక్షన్‌ మూవీ కర్నూల్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: ఎం.సి. రావు, బి గోపాల్‌, ఎమ్‌.వి. మల్లిఖార్జున రావు,కోసూరి సుబ్రమణ్యం, మని.

Updated Date - Mar 07 , 2024 | 01:36 AM