రెండు చిత్రాలు సెట్స్‌పైకి

ABN , Publish Date - May 05 , 2024 | 06:31 AM

ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్టైనర్స్‌ బేనర్‌ సమర్పణలో ఒకే రోజు రెండు సినిమాల చిత్రీకరణ ప్రారంభమైంది. ‘సీత ప్రయాణం కృష్ణతో’, ‘త్రిగుణి’ చిత్రాల ముహూర్తం షాట్‌కు...

రెండు చిత్రాలు సెట్స్‌పైకి

ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్టైనర్స్‌ బేనర్‌ సమర్పణలో ఒకే రోజు రెండు సినిమాల చిత్రీకరణ ప్రారంభమైంది. ‘సీత ప్రయాణం కృష్ణతో’, ‘త్రిగుణి’ చిత్రాల ముహూర్తం షాట్‌కు దర్శకుడు వీరశంకర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, దాసరి మారుతి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను ఆవిష్కరించింది. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ‘సీత ప్రయాణం కృష్ణతో’ చిత్రంలో రోజా ఖుషీ, దినేశ్‌ జంటగా నటిస్తున్నారు. దేవేందర్‌ దర్శకుడు. ‘త్రిగుణి’ చిత్రంలో కుషాల్‌ కథానాయకుడు. వైతహవ్య వడ్లమాని దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 06:31 AM