నోయిడాలో ఫిల్మ్‌ సిటీ.. బిడ్‌ గెలుచుకున్న బోనీ కపూర్‌

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:42 AM

యమునా ఎక్స్‌ప్రెస్‌ వే ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ ఆధ్వర్యంలో నోయిడాలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ హంగులతో ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో...

నోయిడాలో ఫిల్మ్‌ సిటీ.. బిడ్‌ గెలుచుకున్న బోనీ కపూర్‌

యమునా ఎక్స్‌ప్రెస్‌ వే ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ ఆధ్వర్యంలో నోయిడాలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ హంగులతో ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫైనాన్షియల్‌ బిడ్‌లో అధిక ధర కోట్‌ చేసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థ బిడ్‌ గెలుచుకుంది. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భూటానీ గ్రూప్‌లకు చెందిన సంస్థ ఇది.. టీ సిరీ్‌సకు చెందిన సూపర్‌ క్యాసెట్స్‌, నటుడు అక్షయ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని సూపర్‌ సోనిక్‌ టెక్నో బిల్డ్‌, నిర్మాత కె.సి.బొకాడియా సొంత సంస్థ ఫోర్‌ లయన్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు కూడా ఈ పోటీలో పాల్గొన్నాయి. వెయ్యి ఎకరాల స్థలంలో మొదట 230 ఎకరాలల్లో ఫిల్మ్‌ సిటీ పనులు ప్రారంబిస్తారు.

Updated Date - Jan 31 , 2024 | 01:42 AM