బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:19 AM

‘‘మనమే’ చిత్రం మ్యాజికల్‌ బ్లాక్‌ బస్టర్‌. ఈ సారి కుమ్మేశాం. ఇది రాసి పెట్టుకోండి. ఈ నెల 7న థియేటర్లలో కలుద్దాం. ఇది కుటుంబం అంతా కలసి ఎంజాయ్‌ చేస్తూ చూసే సినిమా. ‘శతమానం భవతి’ కన్నా పెద్ద హిట్‌ అవుతుంది..

బ్లాక్‌బస్టర్‌ గ్యారంటీ

‘‘మనమే’ చిత్రం మ్యాజికల్‌ బ్లాక్‌ బస్టర్‌. ఈ సారి కుమ్మేశాం. ఇది రాసి పెట్టుకోండి. ఈ నెల 7న థియేటర్లలో కలుద్దాం. ఇది కుటుంబం అంతా కలసి ఎంజాయ్‌ చేస్తూ చూసే సినిమా. ‘శతమానం భవతి’ కన్నా పెద్ద హిట్‌ అవుతుంది. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచదు’ అని శర్వానంద్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 7న విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో మీరుచూసింది కొంచెమే. ‘మనమే’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మీ తల్లితండ్రులకు చూపించండి. ఈ సారి కొత్త శర్వాను చూడబోతున్నారు. కృతి తన నటనతో ఇరగదీసింది’ అన్నారు. సినిమాలో ఎమోషన్‌తోపాటు ఎంటరైన్‌మెంట్‌ ఉంది అని కృతిశెట్టి చెప్పారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌, ప్రేక్షకులు ఆదరించాలి అని వివేక్‌ కూచిభొట్ల కోరారు.

Updated Date - Jun 02 , 2024 | 02:19 AM