బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌.. మరోసారి!

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:04 AM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌.. ఈ కాంబినేషన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌

బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌.. మరోసారి!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌.. ఈ కాంబినేషన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి, అత్యధిక వసూళ్లు సాధించి, నెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. వీరిద్దరి కలయికలో మరో సినిమా ఎప్పుడా అని ఎదురు చూసేలా చేశాయి. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ ఈ సినిమా వివరాలను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ప్రకటించారు. ‘లెజెండ్‌’ చిత్రాన్ని నిర్మించిన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ భారీ సినిమాను నిర్మించనున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ డివోషనల్‌ టచ్‌తో ఉంది. ఎర్రటి సూర్యుడు, పడుతున్న తోక చుక్కలు చూస్తుంటే బాలకృష్ణతో బోయపాటి మరో పవర్‌ఫుల్‌ సినిమా తీయబోతున్నారని అర్థమవుతుంది. అంతే కాదు బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Jun 11 , 2024 | 05:04 AM