‘నింద’ అందరికీ నచ్చుతుంది

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:19 AM

‘కాండ్రకోట మిస్టరీ’ అని మా సినిమా పోస్టర్‌ వదిలినప్పుడు అందరూ ఇది ఘోస్ట్‌ సినిమా అనుకున్నారు. టీజర్‌ తర్వాత అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. వరుణ్‌ సందేశ్‌కు ఇది తగిన క్యారెక్టర్‌. ఆయనకు ఇది కమ్‌ బ్యాక్‌ సినిమా అవుతుంది’ అన్నారు...

‘నింద’ అందరికీ నచ్చుతుంది

‘కాండ్రకోట మిస్టరీ’ అని మా సినిమా పోస్టర్‌ వదిలినప్పుడు అందరూ ఇది ఘోస్ట్‌ సినిమా అనుకున్నారు. టీజర్‌ తర్వాత అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. వరుణ్‌ సందేశ్‌కు ఇది తగిన క్యారెక్టర్‌. ఆయనకు ఇది కమ్‌ బ్యాక్‌ సినిమా అవుతుంది’ అన్నారు రాజేశ్‌ జగన్నాథం. వరుణ్‌సందేశ్‌ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘నింద’ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది. నిర్మాతల కోసం ప్రయత్నించా. ఆ తర్వాత వేరే వాళ్లు ఎందుకని నేనే నిర్మాతగా మారా. నాకు క్రియేటివ్‌ ఫీల్డ్‌ అంటే ఇష్టం. దర్శకత్వ శాఖ నాకు నచ్చింది. సినిమా తీయడం ఇష్టం కూడా. అయితే తీసిన సినిమాను విడుదల చేయడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది’ అన్నారు. ‘నింద’ సినిమాలో ప్రతి పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది. వరుణ్‌సందేశ్‌ కొత్తగా కనిపిస్తారు. చక్కని ఆర్టిస్టులతో ఈ సినిమా తీశాను. ‘నింద’ చూసిన తర్వాత మలయాళంలోనే కాదు తెలుగులోనూ కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రాలు వస్తున్నాయి అని ప్రేక్షకులు ఫీల్‌ అవుతారు’ అన్నారు జగన్నాథం. తన దగ్గర స్ర్కిప్టులు సిద్ధంగా ఉన్నాయనీ, ఇకపై దర్శకత్వం మీదే ఫోకస్‌ పెడతానని ఆయన చెప్పారు.

Updated Date - Jun 20 , 2024 | 02:19 AM