తొలి ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ బయోపిక్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:26 AM

దేశప్రజలంతా టీవీల ముందు కూర్చుని ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అని జోరుగా...

తొలి ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ బయోపిక్‌

దేశప్రజలంతా టీవీల ముందు కూర్చుని ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అని జోరుగా అంచనాలు, బెట్టింగ్స్‌ సాగుతున్న ఈ నేపథ్యంలో భారతదేశపు తొలి ఎన్నికల ఛీఫ్‌ కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ బయోపిక్‌ తీయనున్నట్లు చిత్ర నిర్మాత సిద్దార్థ రాయ్‌ కపూర్‌ ప్రకటించారు. సివిల్‌ సర్వెంట్‌గా మారిన గణితశాస్త్ర వేత్త సుకుమార్‌ సేన్‌ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు పర్యవేక్షకుడిగా ఉన్నారు. ‘మన జాతీయ కథానాయకుల్లో ఒకరైన సుకుమార్‌ జీవిత కథను తెరకు ఎక్కించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు. తన తాతగారి బయోపిక్‌ను తీసే ప్రయత్నం చేస్తున్నందుకు సుకుమార్‌ సేన్‌ మనవడు సంజీవ్‌ సేన్‌ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 12:26 AM