‘బినాకా గీత్‌ మాలా’ అమీన్‌ సయానీ ఇక లేరు!

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:37 AM

‘బెహనో ఔర్‌ భాయియో’ అంటూ 42 ఏళ్ల పాటు సిలోన్‌ రేడియోలో, ఆ తర్వాత వివిధ భారతిలోనూ ‘బినాకా గీత్‌ మాలా’ కార్యక్రమంతో శ్రోతలను అలరించిన స్వరం మూగబోయింది. రేడియో అనౌన్సర్లకు, జాకీలకు...

‘బినాకా గీత్‌ మాలా’ అమీన్‌ సయానీ ఇక లేరు!

‘బెహనో ఔర్‌ భాయియో’ అంటూ 42 ఏళ్ల పాటు సిలోన్‌ రేడియోలో, ఆ తర్వాత వివిధ భారతిలోనూ ‘బినాకా గీత్‌ మాలా’ కార్యక్రమంతో శ్రోతలను అలరించిన స్వరం మూగబోయింది. రేడియో అనౌన్సర్లకు, జాకీలకు పితామహుడు లాంటి అమీన్‌ సయానీ తన 91 ఏట గుండెపోటుతో బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన సమర్పించే ‘బినాకా గీత్‌ మాలా’ వినడం కోసం ఆ రోజుల్లో ప్రతి బుధవారం అంతా రేడియో ముందు చేరిపోయేవారు. ఈ కార్యక్రమంలో ప్రసారం చేసే పాట గురించి మధ్య మధ్యలో ఆయన చేసే వివరణ చాలా ఆసక్తికరంగా ఉండేది. ‘బినాకా గీత్‌ మాలా’ మాత్రమే కాకుండా క్విజ్‌ ప్రోగ్రామ్‌, షాలీమార్‌ సూపర్‌ జోడీ, ‘సంగీత్‌ కే సితారే’ వంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. 54 వేల రేడియో కార్యక్రమాలు నిర్వహించిన రికార్డ్‌ సృష్టించిన అమీన్‌ సయానీ 2009లో పద్మశ్రీ పురస్కారం పొందారు. ఇప్పటివరకూ పద్మశ్రీ పురస్కారం పొందిన రేడియో అనౌన్సర్‌ అమీన్‌ సయానీ మాత్రమే. అలాగే ‘భూత్‌ బంగ్లా’, ‘బాక్సర్‌’, ‘ఖతాల్‌’ వంటి చిత్రాల్లో అమీన్‌ నటించి, అనౌన్సర్‌ పాత్రలనే పోషించడం విశేషం.

Updated Date - Feb 22 , 2024 | 05:37 AM