కెరీర్‌లో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:25 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం సాగరతీరం...

కెరీర్‌లో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం సాగరతీరం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగచైతన్య యాక్షన్‌ రోల్‌లో అలరించనున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. భారీ ఖర్చుతో నిర్మించిన సెట్‌లో పోరాట ఘట్టాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. పలువురు ఫైటర్లు పాల్గొంటున్నారు. ‘యానిమల్‌’ చిత్రానికి ఫైట్స్‌ రూపకల్పన చేసిన సుప్రీం సుందర్‌ సరికొత్తగా పోరాట ఘట్టాలను తీర్చిదిద్దుతున్నారు. యాక్షన్‌ సీన్లలో నాగచైతన్యను సరికొత్తగా చూపించబోతున్నారు, ఆయన కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ అవుతుందని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 03:25 AM