భిన్నమైన పాత్రల్లో భీమా

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:34 AM

గోపీచంద్‌ కథానాయకుడిగా ఏ. హర్ష దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘భీమా’. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. కేకే రాధామోహన్‌ నిర్మించారు...

భిన్నమైన పాత్రల్లో భీమా

గోపీచంద్‌ కథానాయకుడిగా ఏ. హర్ష దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘భీమా’. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. కేకే రాధామోహన్‌ నిర్మించారు. మార్చి 8న విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. గోపీచంద్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు హర్ష కథను అద్భుతంగా తెరపైకి తెచ్చాడు. రవి బస్రూర్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇరగదీశాడు. ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు. యాక్షన్‌తో పాటు కామెడీ, ఎంటర్టైన్‌మెంట్‌ చాలా గొప్పగా ఉంటుందని హర్ష తెలిపారు.

Updated Date - Feb 25 , 2024 | 02:34 AM