ఆగస్టులో భవనమ్‌ విడుదల

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:50 AM

ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భవనమ్‌’. ‘ది హాంటెడ్‌ హౌస్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ నిర్మిస్తున్నారు...

ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భవనమ్‌’. ‘ది హాంటెడ్‌ హౌస్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌కుమార్‌, వీరేంద్ర సిర్వీ నిర్మిస్తున్నారు. సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహా ఉల్లాల్‌ ప్రథాన తారాగణం. బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం మేకర్స్‌ ‘భవనమ్‌’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల్ని భయపెట్టడంతో పాటు మంచి హాస్యంతో అలరిస్తుందని చిత్రబృందం తెలిపింది. సినిమాటోగ్రఫీ: మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: ఎన్టీఆర్‌.

Updated Date - Jul 18 , 2024 | 12:50 AM