ఆగస్టులో భవనమ్‌

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:28 AM

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన హారర్‌ కామెడీ ‘భవనమ్‌’. ఆగస్టు 9న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను...

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన హారర్‌ కామెడీ ‘భవనమ్‌’. ఆగస్టు 9న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. నటుడు సప్తగిరి మాట్లాడుతూ ‘సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బేనర్‌లో ఓ సినిమా చేయాలనే కల ‘భవనమ్‌’తో నెరవేరింది’ అన్నారు. ఇందులో కామెడీ యాక్షన్‌ సాంగ్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయని షకలకశంకర్‌ చెప్పారు. సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాం, ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు బాలాచారి తెలిపారు.

చిత్రం : భవనమ్‌

ప్రొడ్యూసర్‌ : ఆర్‌బీ చౌదరి, వాకాడ అంజన్‌ కుమార్‌, వీరేంద్ర సీర్వి

డైరెక్టర్‌ : బాలాచారి కూరెళ్ల

బ్యానర్‌ : సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నటీనటులు : సప్తగిరి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేశ్‌, మాళవిక సతీషన్‌ తదితరులు

Updated Date - Jul 30 , 2024 | 04:28 AM