జూలైలో వస్తున్న భారతీయుడు 2

ABN , Publish Date - May 20 , 2024 | 05:07 AM

‘విక్రమ్‌’ సినిమా తర్వాత కమల్‌హాసన్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. ఇది 1996లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన...

జూలైలో వస్తున్న భారతీయుడు 2

‘విక్రమ్‌’ సినిమా తర్వాత కమల్‌హాసన్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. ఇది 1996లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. జూలై 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కమల్‌ హాసన్‌ ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. జూన్‌ 1న ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎ.శ్రీకర ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌, సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌.

Updated Date - May 20 , 2024 | 05:07 AM