భరతనాట్యంతో బాగా నవ్విస్తాం

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:50 AM

సూర్యతేజ ఏలేను హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న ‘భరతనాట్యం’ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ‘దొరసాని’ చిత్ర దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న...

భరతనాట్యంతో బాగా నవ్విస్తాం

సూర్యతేజ ఏలేను హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న ‘భరతనాట్యం’ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ‘దొరసాని’ చిత్ర దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘క్రైమ్‌ కామెడీ ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇంతమంచి ఎంటర్‌టైనర్‌ ద్వారా ధని ఏలే కుమారుడు సూర్యతేజ పరిచయం కావడం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధించాలి’ అని కోరారు. కంటెంట్‌ నమ్మి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు హీరో సూర్యతేజ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ ‘దొరసానికి భిన్నమైన కథ ఇది. అందుకే సవాల్‌గా తీసుకుని మంచి చిత్రం అందించడానికి ప్రయత్నించా. ఇందులో మంచి డ్రామా ఉంది. పాత్రలన్నీ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులు కోరుకొనే అన్నీ అంశాలు ఉన్నాయి. నలభై నిమిషాల పాటు కడుపుబ్బ నవ్వించే సీన్లు ఉన్నాయి’ అని తెలిపారు. కామెడీ, థ్రిల్‌, డాన్స్‌, ఫ్యామిలీ, లవ్‌, డ్రామా.. ఇలా అన్ని అంశాలు చిత్రంలో ఉన్నాయని హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తెలిపారు

Updated Date - Mar 24 , 2024 | 02:50 AM