ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 06:35 AM

స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి వేడుకలు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌.ఎన్‌.సి.సి)లో ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌, వెబ్‌ సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత...

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి

స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి వేడుకలు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌.ఎన్‌.సి.సి)లో ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌, వెబ్‌ సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత టి.డి జనార్ధన్‌ మాట్లాడుతూ ‘‘త్వరలో అధికారంలోకి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించి ఆయనను సముచితంగా గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం’’ అని అన్నారు. ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమాల్లో ఎన్టీఆర్‌ అన్ని రకాల పాత్రలు పోషించి రాముడు, కృష్ణుడు అంటే ఆయనే అనేంతగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు’’ అని చెప్పారు.


ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, కె. ఎస్‌.రామారావు, పుండరీ కాంక్షయ్య తనయుడు అట్లూరి నాగేశ్వరరావు పాల్గొనగా.. ఎన్టీఆర్‌ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు, డా బి.ఎన్‌.ప్రసాద్‌, డా డి.ఎన్‌.కుమార్‌లతో పాటు ఎన్టీఆర్‌ వ్యక్తిగత సహాయకులు పి.ఏ శివరామ్‌, వంటమనిషి బీరయ్య, సహాయ మేకప్‌ మెన్‌ అంజయ్య, డ్రైవర్‌ రమేష్‌, ఆఫీస్‌ అటెండెంట్‌ చంద్రశేఖర్‌ యాదవ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు మన్నే సోమేశ్వర రావు, బొప్పన ప్రవీణ్‌, ఎన్టీఆర్‌ నఫీజ్‌, కొడాలి ప్రసాద్‌, ఈదర చంద్ర వాసులకు కమిటీ చైర్మన్‌ శ్రీ టి. డి. జనార్థన్‌ సారధ్యంలో ఘనంగా సన్మానం జరిగింది.

Updated Date - May 29 , 2024 | 06:35 AM