తలైవా సెట్స్‌లోకి భల్లాలదేవ

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:34 AM

రజనీకాంత్‌ మూవీ సెట్స్‌లోకి రానా దగ్గుబాటి అడుగుపెట్టారు. ‘జైలర్‌’ చిత్రం హిట్‌ అయినా, ఆ తర్వాత వచ్చిన ‘లాల్‌ సలామ్‌’ సినిమా దెబ్బ తినడంతో రజనీకాంత్‌ అభిమానులు కొంత నిరాశ చెందారు...

తలైవా సెట్స్‌లోకి భల్లాలదేవ

రజనీకాంత్‌ మూవీ సెట్స్‌లోకి రానా దగ్గుబాటి అడుగుపెట్టారు. ‘జైలర్‌’ చిత్రం హిట్‌ అయినా, ఆ తర్వాత వచ్చిన ‘లాల్‌ సలామ్‌’ సినిమా దెబ్బ తినడంతో రజనీకాంత్‌ అభిమానులు కొంత నిరాశ చెందారు. అందుకే వాళ్లలో ఉత్సాహం పెంచడానికి మాస్‌ అంశాలతో ఓ కొత్త సినిమా చేస్తున్నారు తలైవా. ‘జై భీమ్‌ ఫేం టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు ‘వేట్టయాన్‌’ . రజనీకాంత్‌ 170వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారంటూ ఆ మధ్య లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటించింది. సోమవారం ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయినట్లు రానా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో ఆయన ఏ పాత్ర పోషిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రంలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తుండటం విశేషం. దాదాపు 43 ఏళ్ల తరువాత రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలసి ఈ ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. వెర్సటైల్‌ నటుడిగా పేరొందిన ఫహాద్‌ ఫాసిల్‌, ప్రముఖ నటి మంజూ వారియర్‌ కూడా ఇందులో నటిస్తున్నారు.

Updated Date - Mar 05 , 2024 | 02:34 AM