అన్ని హంగులతో భైరవకోన

ABN , Publish Date - Jan 19 , 2024 | 05:06 AM

ఫిబ్రవరి 9న దెయ్యాలూ, భూతాలూ, మ్యాజిక్కు, మంచి హ్యూమర్‌, పాటలు, బోలెడంత యాక్షన్‌ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం ఇలా వాణిజ్య హంగులు, చక్కని వినోదంతో ముస్తాబైంది’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు....

అన్ని హంగులతో భైరవకోన

ఫిబ్రవరి 9న దెయ్యాలూ, భూతాలూ, మ్యాజిక్కు, మంచి హ్యూమర్‌, పాటలు, బోలెడంత యాక్షన్‌ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం ఇలా వాణిజ్య హంగులు, చక్కని వినోదంతో ముస్తాబైంది’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించారు. గురువారం చిత్రబృందం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘రెండున్నరేళ్ల పాటు బాధ్యతగా ఈ చిత్రం కోసం పనిచేశాం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాం. ‘నిజమేనే చెబుతున్నా’ పాటను ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు’ అని చెప్పారు. వీఐ ఆనంద్‌ మాట్లాడుతూ ‘‘ఊరుపేరు భైరవకోన’ నా కెరీర్‌లో ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని, ఎక్జయిట్‌మెంట్‌ను ఇస్తుంది’ అని తెలిపారు. రాజేశ్‌ దండా మాట్లాడుతూ ‘మంచి ప్రేమకథ, ఫాంటసీ, కామెడీ, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి’ అని తెలిపారు.

Updated Date - Jan 19 , 2024 | 05:06 AM