భైరవకోన బావుందంటున్నారు

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:41 AM

‘‘ఊరుపేరు భైరవకోన’ చిత్రానికి వంద ప్రీమియర్‌ షోలు పడ్డాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ‘సినిమా హిట్‌. చాలా బావుంది’ అంటున్నారు. నా నటనను మెచ్చుకోవడం...

భైరవకోన బావుందంటున్నారు

‘‘ఊరుపేరు భైరవకోన’ చిత్రానికి వంద ప్రీమియర్‌ షోలు పడ్డాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ‘సినిమా హిట్‌. చాలా బావుంది’ అంటున్నారు. నా నటనను మెచ్చుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. కావ్యథాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. సందీప్‌ కి షన్‌ మాట్లాడుతూ ‘పిల్లలు, పెద్దలు కలసి చూసేలా ఒక ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ను తీశాం. కుటుంబ ప్రేక్షకులంతా చూసే సినిమా ఇది. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’ అన్నారు. అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘ఊరుపేరు భైరవకోన’ ప్రీమియర్స్‌కు ఇలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించాం. టీం అంతా చాలా కష్టపడ్డారు. ప్రీమియర్స్‌ ఈ రేంజ్‌లో సక్సెస్‌ అవ్వడం, సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెప్పడం సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచింది’ అని చెప్పారు. వీఐ ఆనంద్‌ మాట్లాడుతూ ‘ప్రీమియర్‌ షోస్‌ అన్నీ హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. ప్రేక్షకులను మెప్పించినందుకు ఆనందంగా ఉంద’న్నారు. రాజేశ్‌ దండా మాట్లాడుతూ ‘రెండున్నరేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. కంటెంట్‌ను నమ్మి వంద ప్రీమియర్‌ షోస్‌ వేశాం. రూ. కోటి పైన వసూళ్లు రావడం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఇది నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రమని కావ్యథాపర్‌ తెలిపారు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది, ప్రతిసీన్‌ను అమితంగా ఆస్వాదిస్తున్నారు అని వర్ష బొల్లమ్మ చెప్పారు. ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌లో స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

Updated Date - Feb 16 , 2024 | 05:41 AM