భైరవ.. బుజ్జి సాహసాలతో...

ABN , Publish Date - May 31 , 2024 | 01:54 AM

‘‘బుజ్జి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతమంది అరుస్తారు?, భైరవ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతమంది అరుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ‘తెరపైన వాళ్లిద్దరూ కలసినప్పుడు ప్రేక్షకుల నుంచి ఎక్కువ...

భైరవ.. బుజ్జి సాహసాలతో...

‘‘బుజ్జి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతమంది అరుస్తారు?, భైరవ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతమంది అరుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ‘తెరపైన వాళ్లిద్దరూ కలసినప్పుడు ప్రేక్షకుల నుంచి ఎక్కువ హర్షధ్వానాలు వచ్చాయి. ‘కల్కి 2898 ఏడి’ కంటే ముందే ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేషన్‌ సిరీ్‌సను రిలీజ్‌ చేస్తున్నాం. ఇది మా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జూన్‌ 27న థియేటర్లలోకి వస్తోంది. అయితే సినిమా థియేటర్లలో విడుదలవడానికి ముందే వైజయంతీ మూవీస్‌, గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌తో కలసి రూపొందించిన ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేషన్‌ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్‌ ద్వారా నాగ్‌ అశ్విన్‌ కల్కి ప్రపంచాన్ని, బుజ్జి, భైరవ పాత్రల నేపథ్యాన్ని వివరించబోతున్నారు. నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవనుంది. గురువారం చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసి, తొలి ఎపిసోడ్‌ను మీడియా కోసం ప్రదర్శించారు. భైరవ, బుజ్జి సాహసాలతో ట్రైలర్‌ ఆధ్యంతం ఆకట్టుకుంది.

Updated Date - May 31 , 2024 | 09:18 AM