నాలుగు పాత్రల మధ్య

ABN , Publish Date - Dec 27 , 2024 | 02:29 AM

పూర్ణ ప్రధాన పాత్రలో నటించగా జి.ఆర్‌.ఆదిత్య దర్శకత్వంలో సురేశ్‌ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘డార్క్‌ నైట్‌’. పూర్ణ సరసన త్రిగుణ్‌(ఆదిత్‌ అరుణ్‌) నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది....

పూర్ణ ప్రధాన పాత్రలో నటించగా జి.ఆర్‌.ఆదిత్య దర్శకత్వంలో సురేశ్‌ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘డార్క్‌ నైట్‌’. పూర్ణ సరసన త్రిగుణ్‌(ఆదిత్‌ అరుణ్‌) నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘పూర్ణ నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఎమోషనల్‌గా సాగే థ్రిల్లర్‌ కథతో నిర్మించాం. రచయిత, దర్శకుడు జి.ఆర్‌.ఆదిత్య నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు. సినిమా ఆధ్యంతం ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా సన్నివేశాలు ఉంటాయి’ అని తెలిపారు.

Updated Date - Dec 27 , 2024 | 02:29 AM