బెస్ట్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:26 AM

నవీన్‌చంద్ర హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘లెవెన్‌’. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వంలో అజ్మల్‌ ఖాన్‌, రేయా హరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు...

బెస్ట్‌ థ్రిల్లర్‌

నవీన్‌చంద్ర హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘లెవెన్‌’. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వంలో అజ్మల్‌ ఖాన్‌, రేయా హరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే నచ్చేసింది. ఎనిమిది నెలలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి, తెలుగు, తమిళ భాషల్లో విడివిడిగా షాట్స్‌ తీశారు. స్ర్కిప్ట్‌ కోసం ఇంత ప్యాషన్‌గా పని చేసిన నిర్మాతలను నేను చూడలేదు. తప్పకుండా మంచి విజయం సాధిస్తారు. నా కెరీర్‌లో బెస్ట్‌ థ్రిల్లర్‌ అవుతుంది. కథ, స్ర్కీన్‌ప్లే, యాక్షన్‌, యాక్టింగ్‌.. అన్నీ అద్భుతంగా ఉంటాయి’ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన రేయా హరి మాట్లాడుతూ ‘తెలుగులో నాకు ఇది మొదటి సినిమా. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘మాకు ఇది మూడో సినిమా.


మొదటి రెండు చిత్రాలూ హిట్‌ అయ్యాయి. తెలుగు, తమిళ భాఫల్లో విడివిడిగా తీశాం. ఇది ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. అందరికీ నచ్చుతుంది’ అని మరో నిర్మాత అక్బర్‌ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందనీ, త్వరలోనే థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర కూడా పాల్గొన్నారు. రేయా హరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిరామి, దిలీపన్‌, రిత్విక, రవివర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు.

Updated Date - Jun 20 , 2024 | 02:26 AM