బెస్ట్‌ ఓటీటీ షోలు తెలుగులో

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:52 AM

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ మినీ టీవీ ప్రేక్షకులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వివిధ భాషల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోల..

బెస్ట్‌ ఓటీటీ షోలు తెలుగులో

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ మినీ టీవీ ప్రేక్షకులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వివిధ భాషల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షోల తెలుగు, తమిళ డబ్బింగ్‌ వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ‘రక్షక్‌, ఇండియాస్‌ బ్రేవ్స్‌, ఫిజిక్స్‌వాలా’ లాంటి 200కు పైగా షోలతో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాల డబ్బింగ్‌ వెర్షన్లు ఇందులో ఉచితంగా చూడొచ్చు అని ఆ సంస్థ తెలిపింది. వీటితో పాటు కొరియన్‌, టర్కీష్‌, మాండరిన్‌ షోలను సైతం వినియోగదారులు వీక్షించవచ్చు అని అమెజాన్‌ కంటెంట్‌ హెడ్‌ అమోఘ్‌ దుసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 21 , 2024 | 04:52 AM