Bangalore Rave Party: నటి హేమను అరెస్టు చేసిన బెంగుళూరు పోలీసులు

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:46 PM

బెంగుళూరు పోలీసులు నటి హేమని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెని అనకల్ కోర్టులలో హాజరుపరచ నున్నారని తెలిసింది. తదుపరి విచారణ కోసం ఏడు రోజులు కస్టడీ కోరే అవకాశం వుంది.

Bangalore Rave Party: నటి హేమను అరెస్టు చేసిన బెంగుళూరు పోలీసులు
Actress Hema Arrested

బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ, రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపిన బెంగుళూరు పోలీసులు, పాజిటివ్ నిర్ధారణ. జూన్ 1 న హాజరు కావాల్సిన హేమ ఈరోజు విచారణకు హాజరైంది. బెంగుళూరు పోలీసులు హేమని ఈరోజు అరెస్ట్ చేశారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగం కేసులో నటి హేమను సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు

అరెస్టు అనంతరం వైద్య పరీక్షల అనంతరం సీసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం 7 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. అరెస్టు చేసిన హేమని అనకల్ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు.

కొన్నిరోజుల క్రితం బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీపై బెంగుళూరు పోలీసులు ఆకస్మిక దాడి చేసి కొంతమంది సెలబ్రటీలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో సినిమా పరిశ్రమకి చెందిన నటీనటులు కూడా ఉండటం ఆసక్తికరం. తెలుగు సినిమా నటి హేమ కూడా ఆ పార్టీలో పాల్గొన్న సంగతి కూడా పాఠకులకి విదితమే. అయితే తాను ఆ పార్టీలో లేనట్టుగా హేమ కొన్ని వీడియోలు పోస్టు చేసి అభాసుపాలైన సంగతి కూడా తెలిసిందే.

Hema-2.jpg

బెంగుళూరు పోలీసులు తరువాత హేమ పేరును అధికారికంగా ప్రకటించి ఆమె ఆ పార్టీలో వున్నట్టుగా చెప్పారు. అలాగే ఆమె రక్త నమూనాలని కూడా సేకరించి లాబ్స్ కి టెస్టులకు పంపితే ఆమె మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా ఆ టెస్టుల్లో తేలిన విషయం కూడా బెంగుళూరు పోలీసులు చెప్పారు.

తరువాత హేమ కి బెంగుళూరు పోలీసులు నోటీసు జారీ చేసినా తనకి జ్వరంగా ఉందని రాలేను అని మొదట చెప్పినా, తరువాత బెంగుళూరు పోలీసులు జూన్ 1 న రమ్మని మళ్ళీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే జూన్ 1 న హాజరు కావాల్సిన ఆమె.. సోమవారం విచారణకు హాజరైంది. బెంగుళూరు పోలీసులు హేమని విచారించి, ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు, రేపు అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నెల 20న బెంగుళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమ. తరువాత ఆమెకి ఈ డ్రగ్స్‌ కేసులో పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 03 , 2024 | 07:59 PM