కడుపుబ్బా నవ్విస్తుంది

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:13 AM

‘దృశ్యకావ్యం’ ఫేమ్‌ రామ్‌కార్తీక్‌ నటించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌ ‘వీక్షణం’. మనోజ్‌ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రామ్‌కార్తీక్‌, దర్శకుడు మనోజ్‌ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్‌ గొల్లపూడి మీడియాతో...

‘దృశ్యకావ్యం’ ఫేమ్‌ రామ్‌కార్తీక్‌ నటించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌ ‘వీక్షణం’. మనోజ్‌ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రామ్‌కార్తీక్‌, దర్శకుడు మనోజ్‌ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్థ్‌ గొల్లపూడి మీడియాతో ముచ్చటించారు. రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ వినగానే ఆసక్తికరంగా అనిపించింది. ఇందులో నా పాత్ర.. ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఉత్సాహంతో అనుకోని సమస్యల్లో ఇరుక్కోవడం.. వాటిలోంచి బయటపడడమే కథాంశం. సినిమా మొత్తం చాలా వినోదాత్మకంగా.. గ్రిప్పింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. దర్శకుడు మనోజ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అద్భుతమైన థ్రిల్‌ని పంచడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తుంది. ఓ కొత్త దర్శకుడిగా ఈ సినిమా షూట్‌లో ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి’’ అని చెప్పారు. ‘‘అన్ని ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇది. ఇందులో ఉన్న మూడు సాంగ్స్‌ చాలా బాగా వచ్చాయి’’ అని అన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 06:13 AM