బెల్లంకొండ హారర్‌ మిస్టరీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:46 AM

శ్రీరామ నవమి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నిర్మించే కొత్త చిత్రాన్ని నిర్మాత సాహు గారపాటి ప్రకటించారు. ‘భగవంత్‌ కేసరి’ సంచలన విజయం తర్వాత ఆయన...

బెల్లంకొండ హారర్‌ మిస్టరీ

శ్రీరామ నవమి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నిర్మించే కొత్త చిత్రాన్ని నిర్మాత సాహు గారపాటి ప్రకటించారు. ‘భగవంత్‌ కేసరి’ సంచలన విజయం తర్వాత ఆయన నిర్మించే ఈ హారర్‌, మిస్టరీ చిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. శ్రీరాముడు తన చేతిలోని విల్లుతో బాణాన్ని ఆకాశంలో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం , షాడో తోలుబొమ్మలాట, నిర్జనమైన అడవి, యాంటెన్నా టవర్‌, హార్నెట్‌... ఇవన్నీ ఆ పోస్టర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సహ రచయిత: దరహాస్‌ పాలకొల్లు, సంగీతం: బి.అజనీష్‌ లోకనాథ్‌, సమర్పణ: అర్చన, రచన, దర్శకత్వం: కౌశిక్‌ పెగళ్లపాటి.

Updated Date - Apr 18 , 2024 | 06:46 AM