ఆగస్టు నుంచి ఆరంభం

ABN , Publish Date - Jul 21 , 2024 | 01:45 AM

‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిజైనర్‌ నీరజ్‌ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా...

‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిజైనర్‌ నీరజ్‌ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యాయి. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌లో 30 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: నవీన్‌ నూలి, డీఓపీ: జ్ఞానశేఖర్‌ వీ.ఎస్‌, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌.

Updated Date - Jul 21 , 2024 | 01:45 AM