ముందు రిసెప్షన్‌.. తర్వాత పెళ్లి!

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:37 AM

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి నటిగా తెలుగువారికి దగ్గరైన తమిళ నటి వరలక్ష్మి తన పెళ్లి వేడుకలోనూ వైవిధ్యం చూపించారు. వారం రోజుల క్రితం చెన్నైలో వరలక్ష్మి, నికోలై సచిదేవ్‌ల పెళ్లి రిసెప్షన్‌ చెన్నైలో...

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మంచి నటిగా తెలుగువారికి దగ్గరైన తమిళ నటి వరలక్ష్మి తన పెళ్లి వేడుకలోనూ వైవిధ్యం చూపించారు. వారం రోజుల క్రితం చెన్నైలో వరలక్ష్మి, నికోలై సచిదేవ్‌ల పెళ్లి రిసెప్షన్‌ చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ఇలా అందరి అభినందనలు అందుకున్న వరలక్ష్మి, నికోలై సచిదేవ్‌ మంగళవారం థాయ్‌లాండ్‌లోని క్రాబి బీచ్‌ రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య తమిళ సంప్రదాయానికి అనుగుణంగా ఈ పెళ్లి జరిగింది.

Updated Date - Jul 12 , 2024 | 01:37 AM