40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెళ్లికి ముందు...

ABN, Publish Date - Jan 24 , 2024 | 12:44 AM

యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసే కథతో పాటు మంచి సందేశం ఇస్తూ నిర్మించిన ‘బిఫోర్‌ మ్యారేజ్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. మూడు దశాబ్దాల క్రితం ‘టార్జన్‌ సుందరి’, ‘ప్రేమ ఘర్షణ’, ‘సంసార వీణ’ వంటి చిత్రాలు నిర్మించిన వై.నాగేశ్వరరెడ్డి తనయుడు...

యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసే కథతో పాటు మంచి సందేశం ఇస్తూ నిర్మించిన ‘బిఫోర్‌ మ్యారేజ్‌’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. మూడు దశాబ్దాల క్రితం ‘టార్జన్‌ సుందరి’, ‘ప్రేమ ఘర్షణ’, ‘సంసార వీణ’ వంటి చిత్రాలు నిర్మించిన వై.నాగేశ్వరరెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్‌ రెడ్డి తీసిన సినిమా ఇది. భరత్‌, నవీనా రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీధర్‌ రెడ్డి అటాకుల దర్శకత్వం వహించారు. ఎస్‌.కె.ఎం.ఎల్‌. మోషన్‌ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఆదినారాయణ ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఇది. హీరోయిన్‌ బాగా చేసింది. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించాలి’ అని కోరారు. ‘పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు ఆ తర్వాత జీవితంలో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. అదే విషయాన్ని ఈ చిత్రంలో చెప్పాం. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా క్వాలిటీతో తీయడానికి నిర్మాత సహకరించారు. సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు దర్శకుడు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు నిర్మాత చెప్పారు. మంగ్లీ పాడిన పాట హైలైట్‌ అవుతుందని తెలిపారు.

Updated Date - Jan 24 , 2024 | 12:44 AM