అందాల రాక్సీ వచ్చింది

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:30 AM

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు

అందాల రాక్సీ వచ్చింది

అందాల రాక్సీ వచ్చింది

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. గురువారం దిశా పుట్టిన రోజు సందర్భంగా యూనిట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె రాక్సీ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ట్రైలర్‌లో పోరాట ఘట్టాల్లో మెరిసిన దిశా ఈ పోస్టర్‌ లో సైతం పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 14 , 2024 | 03:30 AM