కూల్‌ అవ్వండి మేడం గారు

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:24 AM

విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ నటుడిగా జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగులోనూ ‘మహానటి’, ‘సీతారామం’ లాంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు...

కూల్‌ అవ్వండి మేడం గారు

విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ నటుడిగా జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగులోనూ ‘మహానటి’, ‘సీతారామం’ లాంటి చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో బ్యాంక్‌ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ‘కోపాలు చాలండి శ్రీమతి గారు...కొంచెం కూల్‌ అవ్వండి మేడం గారు’ అంటూ సాగే గీతాన్ని యూనిట్‌ బుధవారం విడుదల చేసింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ప్రత్యేక శైలిలో స్వరపరిచిన ఈ గీతాన్ని విశాల్‌ మిశ్రా, శ్వేతా మోహన్‌లు ఆలపించారు. శ్రీమణి సాహిత్యం ఈ గీతానికి ప్రత్యేకాకర్షణగా నిలిచింది. దుల్కర్‌ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిమిష్‌ రవి, ఎడిటర్‌:నవీన్‌ నూలి

Updated Date - Jun 20 , 2024 | 02:24 AM