అమ్మాయిలతో జాగ్రత్త!

ABN , Publish Date - May 21 , 2024 | 06:06 AM

సూర్యరాజ్‌, మెరీనా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ 20’. అమ్మాయులతో జాగ్రత్త అనేది ట్యాగ్‌లైన్‌. సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి. మహేంద్ర నిర్మించిన...

అమ్మాయిలతో జాగ్రత్త!

సూర్యరాజ్‌, మెరీనా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ 20’. అమ్మాయులతో జాగ్రత్త అనేది ట్యాగ్‌లైన్‌. సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి. మహేంద్ర నిర్మించిన ఈ చిత్రంలోని పాటలు, ప్రచార చిత్రం విడుదల చేశారు. మధుర ఆడియో సంస్థ ద్వారా ఈ చిత్రం పాటలు విడుదల అయ్యాయి. తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌, దర్శకనిర్మాత సాయివెంకట్‌, వి.సముద్ర ముఖ్య అతిధులుగా హాజరై చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు యెలేందర్‌, గీత రచయిత దేవకరణ్‌, సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్‌, కొరియోగ్రాఫర్స్‌ శైలజ, శ్యామ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 06:06 AM