జాగ్రత్త సుమా!

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:43 AM

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే తారల్లో రష్మిక మందన్న ఒకరు. అయితే ఆమె పోస్టులు పెట్టి నెల రోజులయింది. ఈ స్వల్ప విరామానికి గల కారణాన్ని ఆమె తాజాగా అభిమానులతో...

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే తారల్లో రష్మిక మందన్న ఒకరు. అయితే ఆమె పోస్టులు పెట్టి నెల రోజులయింది. ఈ స్వల్ప విరామానికి గల కారణాన్ని ఆమె తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నెల క్రితం నాకు ఓ ప్రమాదం జరిగింది. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. గాయం చిన్నదే. వైద్యుల సలహా మేరకు ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతాను. జీవితం చాలా విలువైంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. జాగ్రత్త సుమా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’. ‘కుబేర’, ‘గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 03:43 AM