రామాయణంలోని పాత్రల ఆధారంగా...

ABN , Publish Date - Oct 08 , 2024 | 02:10 AM

డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లోని ‘సింగం అగైన్‌’లో అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు అయిదు నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను...

డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లోని ‘సింగం అగైన్‌’లో అజయ్‌ దేవ్‌గణ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు అయిదు నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. రామాయణంలోని ప్రధాన పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని దానికి అనుగుణంగా సినిమాను తెరకెక్కిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అజయ్‌ దేవ్‌గణ్‌ను రాముడిగా, కరీనా కపూర్‌ను సీతగా.. అర్జున్‌ కపూర్‌ను రావణుడిగా, రణ్‌వీర్‌ సింగ్‌ను హనుమంతుడిగా, టైగర్‌ ష్రాఫ్‌ను లక్ష్మణునిగా పోల్చి చూపించారు. ఈ ట్రైలర్‌లో దీపికా పదుకొణె, అక్షయ్‌కుమార్‌ కూడా తళుక్కుమన్నారు. దీపావళి కానుకగా నవంబర్‌ 1న సినిమా విడుదలవుతోంది.

Updated Date - Oct 08 , 2024 | 02:10 AM