యథార్ధ సంఘటన ఆధారంగా

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:39 AM

ఒక యథార్ధ సంఘటన స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ సంచలన విజయం సాధించింది. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లు సంపాదించిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది...

యథార్ధ సంఘటన ఆధారంగా

ఒక యథార్ధ సంఘటన స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ సంచలన విజయం సాధించింది. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లు సంపాదించిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ బాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హక్కుల్ని కొన్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. 2006లో కొడైకెనాల్‌లోని గుణ కేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్‌ యువకుల అనుభవాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులో అందిస్తున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 01:39 AM